News5am,Breaking Telugu New (09-05-2025): భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. ఇరు దేశాలు డ్రోన్లు, మిసైల్స్‌తో ప్రతిదాడులు జరుపుకుంటున్న నేపథ్యంలో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య మేం జోక్యం చేసుకోబోమని, జరుగుతున్న పరిణామాలకు తమకు సంబంధం లేదన్నారు. మేము ఉద్రిక్తతలను ప్రోత్సహించం, మేము ఆయుధాలు వదులుకోమని ఎవరికీ చెప్పలేమని, కేవలం దౌత్య మార్గాల ద్వారానే ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ఇక పాక్ ప్రధాని షరీఫ్‌కు అమెరికా సెక్రటరీ మార్కో రుబియో ఫోన్ చేసి ఉద్రిక్తతలు తగ్గించాలని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతు ఉందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రతిదాడులు చేయొద్దని పాక్‌కు సూచించారు. మరోవైపు, ఎల్‌ఓసీ వద్ద పాక్ ఆర్మీకి భారత సైన్యం ధీటుగా ప్రతిచర్యలు ఇస్తోంది. మే 8 అర్ధరాత్రి తర్వాత పాక్ ప్రయోగించిన 15 మిసైల్స్‌ను మన భద్రతా బలగాలు సురక్షితంగా నిర్వీర్యం చేశాయి. ఇందులో ఎస్–400 డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్ హార్పీ డ్రోన్లు కీలకంగా పనిచేశాయి. అంతేగాక, భారత ఉపరితలం నుంచి పాక్ క్షిపణి F-16 ను కూడా భారత సైన్యం కూల్చివేసింది.
More Breaking Telugu News
నూతన పోప్‌గా కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్…
భారత్, పాక్ యుద్ధంతో మాకే సంబంధం లేదు..
More Breaking Telugu New: External Sources
భారత్, పాక్ యుద్ధంతో మాకే సంబంధం లేదు..