Israel-Houthi: ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై భారీ దాడులు చేపట్టింది. హౌతీలు అధీనంలో ఉన్న ఓడరేవులు, సౌకర్యాలపై ఈ దాడులు జరిగాయి. 2023 నవంబర్‌లో ఎర్ర సముద్రం కారిడార్‌లో ప్రయాణిస్తున్న గెలాక్సీ లీడర్ అనే వాణిజ్య నౌకను హౌతీలు హైజాక్ చేసి తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. ఈ చర్యను వారు పెద్ద విజయంగా కూడా ప్రకటించారు. తాజాగా, ఈ నౌకను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. హోదీడా, రాస్ ఇసా, సలీఫ్ వంటి ప్రాంతాల్లో ఉన్న ఓడరేవులు, అలాగే రాస్ కనాటిబ్ విద్యుత్ కేంద్రంపై కూడా దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. హౌతీలు ఈ ప్రాంతాలను ఇరాన్ నుంచి ఆయుధాలు పొందేందుకు, ఉగ్రవాద కార్యకలాపాలకు వేదికగా మార్చారని ఐడీఎఫ్ పేర్కొంది.
గెలాక్సీ లీడర్ నౌక ఇజ్రాయెల్‌కు చెందినదిగా భావించిన హౌతీలు దాన్ని హైజాక్ చేసి రెండు సంవత్సరాలుగా తమ అధీనంలో ఉంచుకున్నారు. ఈ నౌకను ఆధారంగా చేసుకుని ఇతర ఓడలపై దాడులు చేస్తూ, రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న నౌకలను ట్రాక్ చేసి లక్ష్యంగా చేసుకున్నారు. ఇదంతా తెలుసుకున్న ఇజ్రాయెల్, నౌకను ధ్వంసం చేయడంతో హౌతీ రెబల్స్ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఇక హౌతీలు కూడా ఇజ్రాయెల్‌పై క్షిపణులతో ప్రతీకారం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Internal Links:
ట్రంప్‌ను నామినేట్ చేసిన పాకిస్తాన్..
వైట్హౌస్ లో పాక్ ఆర్మీచీఫ్ అసిమ్తో ట్రంప్ భేటీ..
External Links:
హౌతీ రెబల్స్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. హైజాక్‌కు గురైన నౌక ధ్వంసం