Pakistan Nominates Trump

Pakistan Nominates Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో యుద్ధాలను ఆపడంలో కీలక పాత్ర పోషించానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా, 2025లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న యుద్ధ సమయంలో ట్రంప్ తీసుకున్న మధ్యవర్తిత్వ చర్యల్ని ప్రశంసిస్తూ, పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను 2026 నోబెల్ శాంతి బహుమతికి అధికారికంగా ప్రతిపాదించింది. ట్రంప్ జోక్యం వల్ల కాల్పుల విరమణ సాధ్యమైందని, పెద్ద స్థాయి అణ్వాయుధ యుద్ధాన్ని నివారించగలిగామని పాకిస్తాన్ తెలిపింది. భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ప్రతిస్పందనగా, ఇస్లామాబాద్ ‘ఆపరేషన్ బన్యన్ ఉన్ మార్సూస్’ను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పటి పరిస్థితుల్లో ట్రంప్ జోక్యం ఉద్రిక్తతను తగ్గించడంలో సహాయపడిందని పేర్కొన్నారు. ఈ చర్యలు ట్రంప్‌ను శాంతి స్థాపకుడిగా చాటించాయని, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి రావడం న్యాయమని అభిప్రాయపడ్డారు.

అయితే, ఇంత చేసినప్పటికీ నోబెల్ శాంతి బహుమతి రాదన్న విషయంపై ట్రంప్ నైరాశ్యం వ్యక్తం చేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కలిసి డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు రిపబ్లిక్ ఆఫ్ రువాండా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చిన విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్న ట్రంప్, ఇది ఆఫ్రికా, ప్రపంచం కోసం గొప్ప రోజు అయినప్పటికీ, తనకు నోబెల్ బహుమతి లభించదని అన్నారు. అంతేకాదు, భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం, సెర్బియా-కొసావో మధ్య యుద్ధం, ఈజిప్ట్-ఇథియోపియా మధ్య ఉద్రిక్తతల నివారణలో తన పాత్ర ఉన్నప్పటికీ, తనకు నోబెల్ శాంతి బహుమతి లభించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Internal Links:

వైట్హౌస్ లో పాక్ ఆర్మీచీఫ్ అసిమ్తో ట్రంప్ భేటీ..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు..

External Links:

‘ట్రంప్ నిజంగా నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు’.. ట్రంప్‌ను నామినేట్ చేసిన పాకిస్తాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *