అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నట్లు అక్కడి మీడియాలో ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించనున్నారు.
మిచిగాన్‌లోని ఫ్లింట్‌లో ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. భారత్-అమెరికా వాణిజ్యం గురించి మాట్లాడారు. ఇదే సమయంలో భారత ప్రధానితో సమావేశమవుతున్నట్లు ప్రకటించారు. అయితే ఎక్కడ కలుస్తారనే విషయమై ఎలాంటి వివరాలు వెల్లడించలేదని చెబుతున్నారు.