NASA Senior Employees Resigned

NASA Senior Employees Resigned: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. GS-13 నుంచి GS-15 స్థాయి వరకూ ఉన్న 2,145 మంది సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. నిధుల కొరత, ప్రాజెక్టుల ఆలస్యం, పారదర్శకత లోపం వంటి సమస్యలు ఈ రాజీనామా లకు కారణమయ్యాయి. ముఖ్యంగా మార్స్ మిషన్‌కి నిధుల అందుబాటు లేకపోవడం, కొత్త పరిశోధనలకు ఆమోదం లేకపోవడం వంటి అంశాలు సీనియర్ సిబ్బందిలో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. గాడ్డార్డ్ కేంద్రంలో ఉద్యోగాల కోతలు వైట్ హౌస్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నా, కీలక మిషన్లకు నిపుణుల వినిపోవడం నాసా భవిష్యత్తుపై గంభీర ప్రభావం చూపొచ్చని అంచనా.

అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల లేని పరిస్థితిలో ఆర్టెమిస్ మిషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్వహణ, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డేటా విశ్లేషణ వంటి కీలక ప్రాజెక్టులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు అమెరికా అంతరిక్ష రంగాధిపత్యానికి సవాలుగా మారవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నాసా అధికారులు రాజీనామా చేసిన ఉద్యోగులతో చర్చలు జరుపుతూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. వైట్ హౌస్ లక్ష్యం ప్రకారం 5వేల మందిని తొలగించాలనుకున్నా, ఇప్పటివరకు సగం మందే రాజీనామా చేశారు. అయితే బడ్జెట్ కోతలు, ట్రంప్ పాలన నిర్ణయాల వల్ల పరిస్థితులు మరింత దిగజారతాయని భావిస్తూ ఉద్యోగులు నాసా నుంచి నిష్క్రమిస్తున్నారు.

Internal Links:

అమెరికా మరోసారి టారిఫ్ ఆయుధంతో దూకుడు..

హౌతీ రెబల్స్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు..

External Links:

ట్రంప్ చర్యలతో NASA ఖాళీ.. 2 వేల మంది సీనియర్ ఉద్యోగులు రాజీనామా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *