private jet

Private Jet hits rooftop: మెక్సికోలో మంగళవారం (డిసెంబర్ 16) ఘోర విమాన ప్రమాదం జరిగింది. శాన్ మాటియో అటెన్ కో ప్రాంతంలో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ జెట్ విమానం గోడౌన్‌కు చెందిన మెటల్ పైకప్పును ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న 10 మందిలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల ప్రకారం, అకాపుల్కో నుంచి టోలుకా ఎయిర్‌పోర్టుకు ప్రైవేట్ జెట్ ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం సమీపంలోని సాకర్ మైదానంలో ల్యాండింగ్‌కు ప్రయత్నించే క్రమంలో పక్కనే ఉన్న బిజినెస్ సంస్థ భవనానికి చెందిన మెటల్ పైకప్పును ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే మంటలు చెలరేగి విమానం పూర్తిగా కాలిపోయింది. ఘటన స్థలంలో ఇప్పటివరకు ఏడుగురు మృతదేహాలను వెలికితీయగా, భవనంలో ఉన్న సుమారు 130 మందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…

ఇజ్రాయెల్ నుంచి ట్రంప్‌కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు

External Links:

మెక్సికోలో విమాన ప్రమాదం.. ఇండస్ట్రీ గోడౌన్ పైకప్పును ఢీకొట్టిన ప్రైవేట్ జెట్.. ఏడుగురు సజీవదహనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *