Two Planes Collide: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న నలుగురు వ్యక్తులతో కూడిన సింగిల్ ఇంజిన్ విమానం, అక్కడే పార్క్ చేసిన మరో విమానాన్ని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి, దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పక్కనున్న పలు విమానాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే పైలట్ సహా నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఇద్దరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో విమానాశ్రయంలోనే చికిత్స పొందారు.
కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వివరాల ప్రకారం ప్రమాదం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది. ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే విమానం ఆగి ఉన్న మరో విమానాన్ని ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయి. కాలిస్పెల్ అగ్నిమాపక అధికారి జే హేగెన్ ప్రకారం, పైలట్ మరియు ముగ్గురు ప్రయాణికులు క్షేమంగా బయటపడగా, మంటలు సమీపంలోని మరికొన్ని విమానాలను కూడా ప్రభావితం అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Internal Links:
అగ్రరాజ్యాల మధ్య కీలక పరిణామం..
డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ ఫైర్..
External Links:
ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. భారీగా మంటలు