చిక్కడపల్లిలోని ఓ భవనంలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగడంతో లక్షల విలువైన ఆస్తి దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని వాణిజ్య సముదాయంలోని నాలుగో అంతస్తులో భారీగా ప్లాస్టిక్ వస్తువులు ఉండడం వల్ల మంటలు చెలరేగాయి.
మంటలను అదుపు చేసేందుకు ఫైర్ డిపార్ట్మెంట్ శాఖ ఉన్నతాధికారులు నాలుగు ఫైరింజన్లను పంపించారు. మంటలను ఆర్పే క్రమంలో ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది భవనాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు.
దాదాపు మూడు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. స్థానిక పోలీసులు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సహకరించారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకుంటున్నారు.