కరీంనగర్: కడుపునొప్పి భరించలేక క్రిమిసంహారక మందు తాగిన 17 ఏళ్ల బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీణవంక మండలం కొండపాకకు చెందిన గట్టు సాయి కీర్తన సిరిసిల్ల ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. మొదటి సంవత్సరం పరీక్షలు ముగించుకుని ఇంటికి వచ్చింది. మే 17న కడుపునొప్పి తట్టుకోలేక పురుగుమందు తాగింది. వాంతులు చేసుకోవడంతో బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.బాలిక తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.