హైదరాబాద్: కదులుతున్న రైలుకు, ప్లాట్‌ఫారానికి మధ్య జారి పడి, చిక్కుకుపోయిన వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటన సోమవారం వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు ఇరుక్కుపోయాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), ప్రయాణికులు, రైల్వే అధికారులు ప్రయాణీకులను రక్షించేందుకు రంగంలోకి దిగారు. రైలును నిలిపివేసిన తర్వాత, వ్యక్తిని రక్షించడానికి ప్లాట్‌ఫారమ్‌లోని కొంత భాగాన్ని బద్దలు కొట్టాల్సి వచ్చింది. అనంతరం సోమవారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో బీదర్ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్తున్న రైలు దాదాపు 90 నిమిషాలు ఆలస్యమైంది.