500 Generalist Officer Vacancies: బ్యాంకు ఉద్యోగాల నియామకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఐబీపీఎస్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా తర్వాత ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా నియామకాల కోసం ముందుకొచ్చింది. ఈ బ్యాంక్‌లో 500 జనరలిస్ట్ ఆఫీసర్ (స్కేల్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ అవకాశాన్ని కోల్పోకండి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60% మార్కులతో (SC/ST/OBC/PwBD అభ్యర్థులకు 55%) ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అర్హత కలిగి ఉండాలి.
అదనంగా, షెడ్యూల్డ్ పబ్లిక్ లేదా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులో కనీసం 3 సంవత్సరాలు ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. వయస్సు కనిష్టం 22 సంవత్సరాలు, గరిష్టం 35 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ. 64,820 నుండి రూ. 93,960 వరకు జీతం ఇవ్వబడుతుంది. దరఖాస్తు ఫీజు UR/EWS/OBC అభ్యర్థులకు రూ. 1,180, SC/ST/PwBD అభ్యర్థులకు రూ. 118గా నిర్ణయించారు. అర్హత కలిగినవారు ఆగస్టు 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Internal Links:
వైరల్ అవుతున్న జెస్సికా రాడ్‌క్లిఫ్ ఓర్కా వీడియో వెనుక నిజం
రాబోయే 72 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు
External Links:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 500 జనరలిస్ట్ ఆఫీసర్ జాబ్స్.. మిస్ చేసుకోకండి