Aadhaar Update: ఆధార్ కార్డు అనేక ప్రయోజనాలను అందించే కీలక గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు, స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు వంటి సేవలను పొందేందుకు ఇది అవసరం. అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేయకపోతే అది బ్లాక్ అయ్యే అవకాశం ఉండటంతో, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI తాజా హెచ్చరిక జారీ చేసింది. 5–7 సంవత్సరాల వయస్సు గల పిల్లల ‘బాల్ ఆధార్’ కార్డుకు బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేయాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల స్కూల్ అడ్మిషన్, ప్రవేశ పరీక్షలు, ప్రభుత్వ ప్రయోజనాలను పొందడం సులభం అవుతుంది. UIDAI ట్విట్టర్ (X) ద్వారా తల్లిదండ్రులకు అలర్ట్ ఇస్తూ, 7 ఏళ్ల తరువాత అప్‌డేట్ చేయకపోతే పిల్లల ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉందని స్పష్టంచేసింది. 5–7 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఈ బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం, 7 ఏళ్ల తర్వాత అప్‌డేట్ చేయాలంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
0–5 సంవత్సరాల వయస్సులో పిల్లలకు జారీచేసే ఆధార్ కార్డు బయోమెట్రిక్ లేకుండా ఉంటుంది. ఈ దశలో పిల్లల ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా, తల్లిదండ్రుల డాక్యుమెంట్లు మాత్రమే అవసరమవుతాయి. అయితే, ఒకసారి వారు 5 ఏళ్ల వయస్సు పూర్తయ్యాక, మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ తప్పనిసరిగా చేయాలి. ఇందులో వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, తాజా ఫోటోను అప్‌డేట్ చేయాలి. పిల్లలకు జారీచేసే ఆధార్ కార్డును ‘బాల్ ఆధార్’గా పిలుస్తారు. ఈ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయడం వలన వారి ఆధార్ మరింత ప్రామాణికంగా మారుతుంది.
Internal Links:
ఆకాశాన్ని అంటుతున్న కూరగాయ ధరలు..
ఇండిగో తన మాన్సూన్ సేల్ ను ప్రకటించింది..
External Links:
యుఐడిఎఐ బిగ్ అలర్ట్.. ఆధార్ కార్డు బ్లాక్ అయ్యే ఛాన్స్!.. వెంటనే ఈ పని చేయండి!