ఆధార్ కార్డు, అది లేకుండా ఏదీ పనిచేయదు. అది మనకు గుర్తింపుగా పనిచేస్తుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, విద్యాసంస్థల్లో చేరాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా, ప్రభుత్వం ఇచ్చే ప్రజా సంక్షేమ పథకాలు పొందాలన్నా అన్నిటికి ఆధార్ కార్డు ముఖ్యమైనది. పదేళ్లకు పైగా ఆధార్ కార్డ్ కలిగి ఉన్న వారందరికీ ఆధార్ కార్డును అప్‌డేట్ చేయడానికి ఈరోజు (సెప్టెంబర్ 14, 2024) చివరి తేదీ. వ్యక్తిగత గుర్తింపు మరియు చిరునామా రుజువు పత్రాలను సమర్పించడానికి మరియు నవీకరించడానికి UIDAI సంప్రదించాలి. సెప్టెంబర్ 14 తర్వాత రూ.50 చార్జీ ఉంటుంది.ఆధార్ మీ సేవా కేంద్రాల ద్వారా మరియు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ముఖ చిత్రం వంటి బయోమెట్రిక్‌లను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయడం సాధ్యం కాదు.