Air India Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. జూన్ 12న జరిగిన ప్రమాదానికి గల ప్రధాన కారణంగా, ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఇంధన స్విచ్‌లు ఆగిపోవడాన్ని గుర్తించారు. AAIB ప్రకారం, విమానంలో ఫ్యూయల్ పరిమితిగా సరిపడేంత ఉన్నప్పటికీ, రెండు ఇంజిన్ల బటన్లు “రన్” నుండి “కట్ ఆఫ్” కు మారినట్లు కనిపిస్తోంది. పైలట్ల మధ్య జరిగిన సంభాషణలో ఒకరు స్విచ్ ఆఫ్ చేశావా? అని ప్రశ్నించగా, మరొకరు తాను చేయలేదని సమాధానం ఇచ్చినట్లు బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ ద్వారా తెలిసింది. అనంతరం పైలట్లు మేడే కాల్ ఇచ్చారు. విమానం కూలే ముందు వారి సంభాషణ రికార్డయింది.
AAIB వెల్లడించిన ప్రకారం, ప్రమాద సమయంలో విమానంలో ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేవు. పక్షుల కదలికలు, సాంకేతిక బాహ్య హస్తక్షేపానికి ఎటువంటి ఆధారాలు లేవని నివేదిక స్పష్టం చేసింది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రహరీ దాటి ముందే విమానం ఆగిపోవడం గమనించదగిన విషయం. ఇది యంత్రాంగ వైఫల్యం అని భావిస్తున్నారు. విమానంలోని కీలక భాగాలను అధికారులు క్వారంటైన్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుట్ర కోణాన్ని ధృవీకరించే ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
Internal Links:
హిందుస్థాన్ యూనీలీవర్ సీఈవోగా ప్రియా నాయర్..
External Links:
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు!