All India Law Entrance Test 2026: ఢిల్లీ లోని నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాల కోసం 2026 ఏఐఎల్ఈటీ (ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా మరియు ఏడాది ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆగస్టు 7న అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది, చివరి తేదీ నవంబర్ 10గా నిర్ధారించారు. దేశవ్యాప్తంగా డిసెంబర్ 14న పరీక్ష జరుగుతుంది. అర్హతకు ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత ఉండాలి. జనరల్ అభ్యర్థులకు కనీసం 45%, ఓబీసీకి 42%, ఎస్సీ, ఎస్టీలకు 40% మార్కులు అవసరం. ఎలాంటి గరిష్ట వయో పరిమితి లేదు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3500 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీ అభ్యర్థులకు రూ.1500. బీపీఎల్‌కు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ఈ ఎగ్జామ్‌లో మొత్తం 150 మార్కుల కోసం మూడు విభాగాల్లో ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్ Aలో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కు 50 ప్రశ్నలు (50 మార్కులు), సెక్షన్ Bలో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్‌కు 30 ప్రశ్నలు (30 మార్కులు), సెక్షన్ Cలో లాజికల్ రీజనింగ్‌కు 70 ప్రశ్నలు (70 మార్కులు) ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మొత్తం పరీక్షా వ్యవధి 120 నిమిషాలు. ఇద్దరు అభ్యర్థులకు సమానమైన స్కోర్ వస్తే, లాజికల్ రీజనింగ్‌లో పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.
Internal Links:
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు..
ఆగస్టు 15 నుంచి ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ ఫాస్ట్..
External Links:
ఆల్ ఇండియా లా ఎంట్రెన్స్ టెస్ట్: ఇంటర్ పాసైతే చాలు, వేంటనే అప్లయ్ చేసుకోండి