భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల కలెక్టర్లు నివేదికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాతో పాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పాఠశాలలకు కలెక్టర్లు ఈ రోజు (జులై 20) సెలవు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *