స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం గోల్కొండ కోటలో రిహార్సల్స్. మంగళవారం డీజీపీ జితేందర్, నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ వివిధ శాఖలు, పోలీసు సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, కళాకారుల రిహార్సల్స్‌ను పరిశీలించారు.
కోటలో పోలీసుల మోహరింపుపై చర్చించారు. ఎంట్రీ పాస్ ఉన్న వారినే వేడుకకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఏబీసీడీఈ పాస్ హోల్డర్లు నిర్దేశించిన మార్గాల్లోనే రావాలని నిర్ణయించారు.