ఎస్సీ, ఎస్టీలను రాజ్యాధికారం నుంచి దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు అన్నారు. వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు తీర్పు కాదని, బీజేపీ తీర్పు అని విమర్శించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ వర్గ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ సర్వయ్య, కో కన్వీనర్ చెన్నయ్య నేతృత్వంలో సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన సభ్యులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 21న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని కుల వ్యతిరేక నినాదంతో ఆగస్టు 21న జరిగే భారత్ బంద్‌లో పాల్గొనాలని ఎస్సీ, ఎస్టీ సోదరులు పిలుపునిచ్చారు.