Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం ఈ బుధవారం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. కార్మిక, రైతు, దేశ హితాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కార్పొరేట్ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఈ ‘భారత్ బంద్’లో సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటారని అంచనా. బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, పోస్టల్, రవాణా వంటి కీలక ప్రభుత్వ రంగాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని హింద్ మజ్దూర్ సభ నేత హర్భజన్ సింగ్ సిద్ధూ తెలిపారు. నెలల తరబడి చేసిన సన్నాహకాలతో వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత అమర్జీత్ కౌర్ వెల్లడించారు.
గతేడాది కార్మిక శాఖ మంత్రికి సమర్పించిన 17 డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కాక, గత పదేళ్లలో ఒక్క వార్షిక కార్మిక సదస్సును కూడా నిర్వహించకపోవడం ప్రభుత్వ ఉదాసీనతను చూపుతోందని సంఘాలు ఆరోపించాయి. కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మిక హక్కులను హరించేవి, యూనియన్ల స్వేచ్ఛను అణచివేసేవని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలకు వ్యతిరేకంగా కూడా ఈ Bharat Bandhను చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృత నిరసనలు జరగనున్నాయి.
Inernal Links:
విశాఖ యోగా డేలో ప్రధాని మోదీ..
అర్హతతో రైల్వే జాబ్ కొట్టే ఛాన్స్..
External Links:
రేపు భారత్ బంద్.. రోడ్డెక్కనున్న 25 కోట్ల మంది కార్మికులు