Bharat Taxi: దేశంలో ఓలా, ఉబర్‌ల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో కొత్త రైడ్-హెయిలింగ్ సేవను ప్రారంభించబోతోంది. సహకార పద్ధతిలో నడిచే ఈ సేవలో డ్రైవర్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయకుండా, కేవలం సభ్యత్వ రుసుముతోనే ప్రయాణాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఓలా, ఉబర్ సంస్థలు ప్రతి రైడ్‌పై 25 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నాయని, అదనంగా రద్దీ సమయాల్లో ప్రయాణికులపై అధిక చార్జీలు వేస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో, డ్రైవర్లు మరియు ప్రయాణికులకు సమానమైన లాభం చేకూర్చేలా ఈ కొత్త విధానం రూపొందించారు.
కేంద్ర సహకార శాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (NeGD) కలిసి రూ.300 కోట్లతో ‘సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్’ సంస్థను ఏర్పాటు చేశారు. డ్రైవర్లు నెలవారీ లేదా రోజువారీ సభ్యత్వ రుసుము చెల్లించి ఈ ప్లాట్‌ఫామ్‌లో చేరవచ్చు, దాంతో ప్రయాణ చార్జీలు పూర్తిగా వారికే దక్కుతాయి. నవంబర్‌లో ఢిల్లీలో 650 క్యాబ్‌లతో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించి, డిసెంబర్ నాటికి ముంబై, పుణె, భోపాల్, జైపూర్ తదితర 20 నగరాలకు విస్తరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో సేవలను ప్రారంభించి, 2030 నాటికి లక్షమంది డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
ఓలా, ఉబర్‌కు చెక్.. వచ్చేస్తోంది ‘భారత్ ట్యాక్సీ’