News5am, Breaking Latest News (04-06-2025): తెలంగాణ టెట్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు జూన్ 18 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. టెట్ ఎగ్జామ్స్ రోజూ రెండు షిఫ్ట్లలో జరుగుతాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుంది. పేపర్ 1ని 5వ తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు, పేపర్ 2ని 6వ తరగతి పైబడి బోధించాలనుకునే అభ్యర్థులు రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు కొన్ని సబ్జెక్టులకు హిందీ, కన్నడ, తమిళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం మాధ్యమాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
పేపర్ 2లోని మ్యాథ్స్, సైన్స్ పరీక్షలతో టెట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మొత్తం 16 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 30న మైనారిటీ భాషల్లో మాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ పరీక్షలతో పరీక్షలు ముగుస్తాయి. షెడ్యూల్‌లో జిల్లాల వారీగా పరీక్షా కేంద్రాలు, తేదీలు, సంబంధిత సబ్జెక్టుల వివరాలు పేర్కొన్నారు. నిజామాబాద్, జగిత్యాల, పటాన్‌చెరు, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని, అభ్యర్థులు షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వం తెలిపింది.
More Breaking Latest Today:
Breaking Latest News:
ఇస్రోలో 320 ఇంజనీర్ జాబ్స్ రెడీ..
మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ..
More Breaking Latest News: External Sources
తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే..