News5am, Breaking Latest Telugu News (2025-05-13) :సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు మంగళవారం (మే 13) విడుదలయ్యాయి. సీబీఎస్సీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ శాన్యం భరద్వాజ్ ప్రకారం, ఈ ఏడాది 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 87.98 శాతం ఉండగా, ఈసారి ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలదే పైచేయి నమోదైంది. బాలికలు 91.64 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 85.70 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ట్రాన్స్జెండర్ అభ్యర్థులు ఈసారి 100 శాతం ఉత్తీర్ణత సాధించి మంచి ప్రదర్శన కనబరిచారు. పరీక్షకు హాజరైన 16,92,794 మందిలో 1,11,544 మంది 90 శాతానికి పైగా, 24,867 మంది 95 శాతానికి పైగా మార్కులు సాధించారు. అయితే, 1.29 లక్షల మంది కంపార్ట్మెంట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 7,842 సెంటర్లలో సీబీఎస్సీ పరీక్షలు నిర్వహించగా, దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు 10వ, 12వ తరగతుల పరీక్షలకు హాజరయ్యారు. అంతేకాక, విదేశాల్లోని 26 దేశాల్లో కూడా పరీక్షలు నిర్వహించారు. మొత్తం మీద 10వ తరగతికి 24.12 లక్షల మంది, 12వ తరగతికి 17.88 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
More News from News 5am:
Breaking Latest Telugu News:
ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ బదులు వీటిని తాగండి..
‘జాట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్..
More Latest Telugu News: External Sources
https://tv9telugu.com/career-jobs/cbse-results-2025-cbse-board-class-12-result-2025-declared-result-direct-link-here-1534463.html