News5am, Breaking News Telugu News(06-05-2025): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టే ఉద్దేశం ఉన్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) నేతలు జరిపిన చర్చలు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఉద్యోగుల సమస్యలపై పరిష్కారానికి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రకటించింది.
ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణభాస్కర్ సభ్యులుగా ఉన్నారు. వారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉద్యోగ భద్రత, కారుణ్య నియామకాలు, ప్రైవేటు బస్సుల విషయాలు, బకాయిలు వంటి డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నప్పటికీ, సమస్యల పరిష్కారం కోసం తగిన సమయం ఇచ్చామని జేఏసీ నేతలు తెలిపారు.
More News:
Breaking News Telugu:
ప్రకాశం జిల్లాలో మరోసారి భూప్రకంపనలు…
ఓటీటీలోకి వచ్చేస్తున్న రీసెంట్ డిజాస్టర్..
More Breaking Big News: External Sources
Rtc Strike : తెలంగాణ ఆర్టీసీ సమ్మె తాత్కాలిక వాయిదా