News5am, Breaking News Telugu (31-05-2025): దేశవ్యాప్తంగా మరోసారి కరోనా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం రేపింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పని చేసే నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడ పనిచేసే ఇతర ఉద్యోగులందరికీ వైద్య బృందం కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. పాజిటివ్‌గా తేలిన ఉద్యోగులు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఇటీవల శాంతినగర్‌లో నివసించే ఇద్దరు వృద్ధులకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వారు గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు మరో నాలుగు కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా కోవిడ్ కేసులు వరుసగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More Breaking News Telugu General:
News Telugu:
మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ..
More Breaking News: External Sources
ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం..! నలుగురు సిబ్బందికి కోవిడ్ పాజిటివ్