Breaking Telugu News Latest

News5am, Breaking Telugu News Latest (02-06-2025): అస్సాంను ముంచెత్తిన భారీ వర్షాలు 132 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టాయి. ఈ ఏడాది మునుపెన్నడూ లేని విధంగా వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు పోకడలేకుండా పొంగిపోయాయి. ఇళ్లు, రహదారులు నీట మునిగిపోయాయి. అస్సాంలో రెండవ అతిపెద్ద నగరమైన సిల్చార్‌లో జూన్ 1న ఒక్కరోజే 415 మి.మీ వర్షపాతం నమోదై 1893లో నమోదైన 290.3 మి.మీ వర్షాన్ని మించిపోయింది. వర్షాల కారణంగా అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ వర్షాలతో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. 2022లో సిల్చార్‌ నగరాన్ని వరదలు ముంచినప్పటి నుంచి మరోసారి అదే పరిస్థితి నెలకొంది.

ఇటీవలి మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడడంతో మరిన్ని ప్రాణనష్టాలు సంభవించాయి. మే 31న మిజోరాంలో సాధారణం కంటే 1,102 శాతం అధిక వర్షపాతం నమోదవగా, మే 28 నుంచి జూన్ 1 వరకు మేఘాలయలో భారీ వర్షాలు కురిశాయి.

More News Latest:

General Telugu News Latest:

వాయుగుండంగా మారిని తీవ్ర అల్పపీడనం..

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు..

More Breaking Telugu News Latest: External Sources

అస్సాంను ముంచెత్తిన వరదలు.. 132 ఏళ్ల రికార్డ్ బద్ధలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *