Breaking Telugu General News

News5am, Breaking Telugu General News (20-05-2025): మీరు బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకుంటున్నారా? బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ హోదాలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి జీతంతో కూడిన ఈ ఉద్యోగాలు పొందితే జీవితంలో స్థిరత సాధించవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే 2025 ఏప్రిల్ 30 నాటికి అభ్యర్థి వయస్సు గరిష్టంగా 28 ఏళ్లలోపు ఉండాలి. అయితే SC/ST వర్గానికి చెందిన వారికి వయస్సులో 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది.

ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులను మొదట 3 ఏళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వారి పనితీరు ఆధారంగా ఈ కాలాన్ని పొడిగించే అవకాశముంది. ఈ ఉద్యోగాలకు వార్షికంగా రూ.7.44 లక్షల జీతం లభిస్తుంది. దరఖాస్తు ఫీజుగా జనరల్ వర్గం అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ వర్గానికి చెందిన వారు రూ.200 చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ మే 19, 2025 నుండి ప్రారంభమై ఉండగా, ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు మే 26లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

More General News:

Breaking Telugu General News:

అగ్నిప్రమాదంలో కనీసం 17 మంది మరణించారు..

మరోసారి రంగంలోకి హైడ్రా..

More Breaking General News: External Sources

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో జూనియర్ ఆఫీసర్ జాబ్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *