News5am,Breaking Telugu New (08-05-2025): ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రమైంది. పాకిస్థాన్ అరకొరగా కాల్పులకు పాల్పడుతోంది. మే 7 అర్ధరాత్రి జరిగిన కాల్పుల్లో 13 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మే 8న అమృత్సర్ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ మిసైల్ దాడి చేయాలనుకుంది. అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో మిసైల్ శకలాలు గుర్తించబడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దులోని గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
ఇక రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దులను తాత్కాలికంగా మూసివేశారు. ఈ రాష్ట్రాల్లో బహిరంగ సభలపై నిషేధం విధించారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించే వారిని చూడగానే కాల్చివేయాలని కేంద్రం అధికారులను ఆదేశించింది. పాకిస్థాన్‌తో 1,037 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు కలిగిన రాజస్థాన్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు భద్రతా బలగాలకు ఎలాంటి అనుమానాస్పద కదలికలు కనిపించినా కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. జోధ్‌పూర్, కిషన్‌గఢ్, బికనీర్ విమానాశ్రయాల నుంచి మే 9 వరకూ విమాన సర్వీసులను నిలిపివేశారు. సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్ వరకు గస్తీ నిర్వహిస్తున్నాయి. బికనీర్, శ్రీ గంగానగర్, జైసల్మేర్, బార్మేర్ జిల్లాల్లో పాఠశాలలు మూసివేసారు, పరీక్షలు వాయిదా వేశారు. పోలీసులు, రైల్వే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. పంజాబ్‌లో పోలీస్ సిబ్బంది సెలవులు రద్దు అయ్యాయి.
More Breaking Telugu News
Telugu Latest News Live : నేడు స్టాక్ మార్కెట్..
Telugu Latest News Today : టీమిండియా అభిమానులకు భారీ షాక్..
More Breaking Telugu New: External Sources
డౌట్ వస్తే కాల్చి పారేయండి : ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన కేంద్రం