News5am, Breaking Telugu News (07-06-2025): హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం జరిగే చేప ప్రసాదం పంపిణీ ఈసారి జూన్ 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమాన్ని బత్తిని గౌడ్ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఉబ్బసం, దమ్ము, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారు ఈ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. గతేడాది 2.5 లక్షల మంది ప్రసాదం తీసుకోగా, ఈసారి ఆ సంఖ్య 3 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రసాదం తీసుకున్నవారు 45 రోజుల పాటు ఆహార నియమాలు పాటించాలి. తెలంగాణ మత్స్య శాఖ ఈ కార్యక్రమానికి 1.25 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచుతోంది.
ఈ సంవత్సరం కూడా జూన్ 8న ఉదయం 10 గంటల నుంచి ప్రసాదం పంపిణీ ప్రారంభమై, జూన్ 9 ఉదయం 10 గంటల వరకు కొనసాగుతుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి కూడా ప్రజలు భారీగా వస్తారని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. కార్యక్రమం సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్టు వారు పేర్కొన్నారు.
More Breaking Telugu News General:
Telugu News:
తొక్కిసలాట కలకలం: ఆర్‌సిబి ఉద్యోగిని అరెస్టు చేసిన పోలీసులు
బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా అధికారుల కొరడా…