Ghmc Special Council Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఈరోజు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను అధికారులు సభ ముందు ఉంచనున్నారు. వార్డుల పునర్విభజన ఎలా జరిగింది, దీనిపై వచ్చిన అభ్యంతరాలు వంటి అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఏ ప్రామాణికాలను ఆధారంగా తీసుకుని వార్డుల విభజన చేశారో స్పష్టత లేదని, సరిహద్దుల మ్యాప్‌ను అందించలేదని పలువురు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అలాగే కొన్ని వార్డుల్లో జనాభా ఎక్కువగా, మరికొన్నింటిలో తక్కువగా ఉండటంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసి పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా పాల్గొననున్నారు. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా కమిషనర్‌కు అందజేశారు. ఈ సమావేశంలో వ్యక్తమయ్యే సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది డీలిమిటేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. అందుకే నేటి ప్రత్యేక సమావేశం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మళ్లీ పెరిగిన బంగారం–వెండి ధరలు: హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే!
భారీ లేఆఫ్స్ ప్రభావం – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!
External Links:
నేడు జీహెచ్ఎంసి ప్రత్యేక కౌన్సిల్ సమావేశం… వార్డుల డీలిమిటేషన్‌పై కీలక చర్చ