గోదావరిలో పైపులైన్ నుంచి గ్యాస్ లీకేజీ అయోమయం, యానాం దరియాలతిప్ప కాట్రేనికోన మండలం బలుసుతిప్ప సెంట్రల్ పరిధిలో గోదావరి పైపులైన్ గ్యాస్ లీకేజీ. యానాం దర్యాల మీదుగా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప ప్రాంతం నుంచి గోదావరి పైపులైన్ గ్యాస్ లీకేజీ ఏర్పడింది. ఇది గమనించిన స్థానిక మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు. గ్యాస్ వాసన వ్యాపిస్తుండటంతో మంటలు చెలరేగే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ కంపెనీ ఓఎన్‌జీసీ అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీ నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో గోదావరి జిల్లాల్లోని ఓఎన్‌జీసీ పైపులైన్ల నుంచి గ్యాస్ లీకేజీలు వెలువడ్డాయి. కొన్ని చోట్ల మంటలు కూడా చెలరేగి భారీ నష్టం వాటిల్లింది.