నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని సర్వే నంబర్ 109లో 20 ఎకరాలు కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. మరోవైపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రఘునాథ పాలెం మండలం జింకల తండాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లు శంఖుస్థాపన చేయనున్నారు.
శంకుస్థాపన నియోజకవర్గాలు: కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట.