Heavy Rains in Telangana: దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేయగా, తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో వర్షపాతం మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ హైదరాబాద్ చీఫ్ కె. నాగరత్న తెలిపారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
జూలై 22 వరకు కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే రాయలసీమ, లక్షద్వీప్ ప్రాంతాల్లో కూడా రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Internal Links:
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్..
External Links:
దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ