హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. ఈ మేరకు ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించడంలో ఏ మాత్రం ఉపేక్షించకుండా పక్కగా ముందుకెళ్తోంది. పెద్ద పెద్ద నిర్మాణాలను సైతం బుల్డోజర్లతో ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలకు కారకమైన అధికారులపై యాక్షన్ కు దిగింది. ఆరుగురు అధికారులపై వేటుకు సిఫార్సు చేసింది. దీంతో ఆరుగురు అధికారులు పై కేసు నమోదయింది. సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజాంపేట, చందానగర్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ , అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి, బాచుపల్లి తహసిల్దార్ పై కేసు నమోదు చేసింది.
గతంలో వీళ్లు చెరువుల నిర్మాణాలకు అనుమతులిచ్చారని హైడ్రా విచారణలో తేలింది. దీంతో అక్రమ నిర్మాణాలను కూలగొట్టడమే కాకుండా వాటికి అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు కేసులు నమోదు చేస్తున్నారు. ఇంకా మరికొందరు హైడ్రా జాబితాలో ఉన్నారని తెలిసింది. అందులో హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్, చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి తహశీల్దార్ పూల్‌సింగ్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, మేడ్చల్-మల్కాజ్‌గిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్‌పై ఈవోడబ్ల్యూ వింగ్‌లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి కేసులు నమోదు చేశారు.