News5am, Just Happened Incident (14-05-2025): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఇది వీడ్కోలు కాదు, ఒక దశ నుంచి మరో దశలోకి ప్రవేశం మాత్రమే. ఈ కాలంలో ఎన్నో నేర్చుకున్నాను. సహచర జడ్జిలు, న్యాయవాదులు ఎంతో సహకారం అందించారు. వారందరికీ కృతజ్ఞతలు. ఎన్నో జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తున్నాను, అవి నా జీవితాంతం పదిలంగా ఉంటాయి” అని భావోద్వేగంగా తెలిపారు. తాను ఇకపై ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని, అవసరమైతే న్యాయ వ్యవస్థకే సేవలు అందిస్తానని వెల్లడించారు.
తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ బీఆర్ గవాయ్ గురించి సంజీవ్ ఖన్నా ప్రశంసలు గుప్పిస్తూ, ఆయన ప్రాథమిక హక్కులను కాపాడతారని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని నమ్మకమున్నదన్నారు. గవాయ్ గొప్ప న్యాయమూర్తి అని కొనియాడుతూ, తాను ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. గవాయ్ కూడా ఖన్నా గురించి స్పందిస్తూ, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఎప్పుడూ కోపంగా చూడలేదని పేర్కొన్నారు. జస్టిస్ ఖన్నా 2024 నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి సుమారు ఆరు నెలలపాటు ఆ పదవిలో కొనసాగారు.
More Incidents:
Just Happened Incident
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో దారుణం..
వాణిజ్యంలో భారత స్టాక్ మార్కెట్
More Just Happened Incident: External Sources
ఎన్నో జ్ఞాపకాలు వెంట తీసుకెళ్తున్న ఇది వీడ్కోలు కాదు.. ఒక దశ నుంచి మరో దశకు ప్రారంభం