Kothagudem Airport: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను ఈ బృందం పరిశీలించనుంది. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలంగా లేకపోవడంతో కొత్త స్థలాలను గుర్తించినట్లు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ స్థలాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను కేంద్ర బృందం పరిశీలించనుంది.
కేంద్ర సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన తర్వాత కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంత ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. భద్రాచలం ప్రాంత ప్రాధాన్యం, ప్రజలకు విమానాశ్రయం అవసరాన్ని వివరించగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు తీసుకున్నారని మంత్రి తుమ్మల తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!