PM Modi: 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వాస్తవ జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందింది. ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, ఇది దేశ ప్రజల కష్టం, సమష్టి శక్తికి నిదర్శనమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చి, ‘వోకల్ ఫర్ లోకల్’, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
MoSPI గణాంకాల ప్రకారం, తొలి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ రూ.81.36 లక్షల కోట్లకు చేరగా, నామమాత్ర జీడీపీ రూ.88.27 లక్షల కోట్లుగా నమోదైంది. వాస్తవ GVA కూడా 8.2 శాతం వృద్ధి చెందింది. ఈ బలమైన ఆర్థిక వృద్ధి భారత్ పురోగతిని స్పష్టంగా చూపుతోందని ప్రధాని పేర్కొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!