News5am, Latest Breaking News (29-05-2025): జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మరియు డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ అనారోగ్యానికి గురయ్యారు. ఎంపీ బృందంతో కలిసి సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారని బీజేపీ ఎంపీ మరియు ప్రతినిధి బృందం నాయకుడు బైజయంత్ పాండా తెలిపారు.
బీజేపీ నాయకుడు బైజయంత్ పాండా నేతృత్వంలోని ఎంపీ బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటనలో ఉంది. ఆ బృందంలో గులాం నబీ ఆజాద్ కూడా భాగంగా ఉన్నారు. సౌదీలో పర్యటిస్తున్న సమయంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో రియాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారని సమాచారం. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్యం స్థిరంగా ఉందని పాండా ట్వీట్ చేశారు.
More Latest General News:
Breaking News:
మంత్రులకు సీఎం ప్రత్యేక డిన్నర్..
అవార్డును గౌరవంగానే కాదు బాధ్యతగా ఫీల్ అవుతున్నాం..
More Latest Breaking Today: External Sources
గులాం నబీ ఆజాద్‌కు అస్వస్థత, సౌదీ ఆసుపత్రిలో చేరిక..