News5am, Latest News Breaking (16-06-2025): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ మరియు మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ దక్షిణ–పశ్చిమ దిశగా విస్తరించగా, వాయవ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు తెలిపారు. శనివారం ఉత్తరాంధ్ర తీరాన్ని ప్రభావితం చేసిన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వర్షపు వ్యవస్థ, తాజా వాయవ్య బంగాళాఖాత ఆవర్తనంలో విలీనమైందని పేర్కొన్నారు.
ఈ పరిణామాల ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ మరియు ఉత్తర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణాలో కూడా మోస్తరు వర్షాలు కురవచ్చు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా సోమవారం నాడు ఉత్తర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే సగటున 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
More Weather News Breaking:
Latest News Breaking:
More Latest News Breaking: External Sources
మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు