News5am, Latest Telugu Breaking News2 (22-05-2025): అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారత రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచే భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మేఘావృతంగా ఉంది, అక్కడక్కడ వాన పడుతోంది. వర్షం కారణంగా ఉద్యోగులు ఉదయాన్నే తమ డ్యూటీలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
సాధారణంగా రోహిణి కార్తె సమయంలో తీవ్ర ఎండలు ఉంటాయి. అయితే ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. ప్రజలకు కొంత ఉపశమనం లభించినా, వర్షం వల్ల పంట తడవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇది వారిలో ఆవేదనకు కారణమవుతోంది.
More Telugu Weather News:
Latest Telugu Breaking News2:
ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు..
హైదరాబాద్ వాసులకు IMD బిగ్ అలర్ట్..
More Latest Weather Telugu News: External Sources
హైదరాబాద్‌లో కమ్ముకున్న మేఘాలు.. పలుచోట్ల వర్షం