News5am Latest Telugu News One( 12/05/2025) : సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 26 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక రాబోయే మూడు రోజులలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం ఖమ్మంలో గరిష్ఠంగా 41.4 డిగ్రీలు, హైదరాబాద్లో కనిష్ఠంగా 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశముంది.
మే 11 ఆదివారం నాడు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్లో 41.7, నిజామాబాద్లో 41, ఆదిలాబాద్లో 39.8, ఖమ్మంలో 39.4, నల్లగొండలో 39, మహబూబ్ నగర్లో 39, రామగుండంలో 38.8, హైదరాబాద్లో 38.2, భద్రాచలం మరియు హనుమకొండలో వరుసగా 38.2, 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.