Breaking Latest News

LIC HFL Recruitment 2025: ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పొచ్చు. LIC HFL 250 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వయస్సు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాల లోపులో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ముందుగా జూలై 3, 2025న నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరవవలసి ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించినవారికి జూలై 8-9 తేదీల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఎంపికైన అభ్యర్థులకు జూలై 10, 11 తేదీల్లో ఆఫర్ లెటర్లు అందజేస్తారు. అప్రెంటిస్‌షిప్ వ్యవధి 12 నెలలు కాగా, ఈ కాలంలో వారికి నెలకు రూ. 12,000 స్టైఫండ్ లభిస్తుంది. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 944, ఎస్సీ/ఎస్టీలకు రూ. 708, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 472. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 28, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం అధికారిక లింక్‌ను సందర్శించవచ్చు.

Internal Sources:

గద్దర్ ఫౌండేష‌న్‌కు రూ.3 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

నీట్ (యూజీ) ఫలితాలు విడుదల..

External Sources:

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో జాబ్స్.. త్వరగా అప్లై చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *