తెలంగాణలో మూడు రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయనున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీకి రెండు రోజుల ముందు మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలో రేపటి నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరుచుకోవని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అధికారులు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *