Lookout Notices: పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి అతడు పారిపోకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ఏ ఎయిర్‌పోర్టులో భగీరథ్ కనిపించిన వెంటనే సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ కేసులో భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం జరిగిన వాదనలు అనంతరం తీర్పును తర్వాత వెల్లడిస్తామని కోర్టు తెలిపింది. ఈలోగా అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ ఇవ్వాలన్న భగీరథ్ తరఫు న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తారని చెప్పినా, అరెస్టు నుంచి రక్షణ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు జస్టిస్ టి. మాధవీదేవి తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
బండి భగీరథ్కు లుకౌట్ నోటీసులు.. ఏ ఎయిర్ పోర్టులో కనిపించినా సమాచారం ఇవ్వాలన్న పోలీసులు