NEET UG 2026: దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన నీట్ (NEET) యూజీ 2026 పరీక్షపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రం లీక్, అవకతవకల ఆరోపణల కారణంగా రద్దైన ఈ పరీక్షను జూన్ 21 ఆదివారం మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు, పరీక్షా కేంద్రాల వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే అనుసరించాలని సూచించింది.
మే 3న నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై కోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పరీక్షను మళ్లీ నిర్వహించాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో జరిగిన కీలక సమావేశం అనంతరం రీ-ఎగ్జామ్ తేదీపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసారి పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ పెంచడంతో పాటు ప్రశ్నపత్రాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచనున్నట్లు వెల్లడించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
విషపూరితంగా మారిన కిడ్స్ సిరప్..
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.