Recruit 1000 Professor Posts

Recruit 1000 Professor Posts: తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించరు. మొత్తం 1,000 అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 566 పోస్టులు, ఉద్యాన విశ్వవిద్యాలయంలో 140 పోస్టులు, పశువైద్య విశ్వవిద్యాలయంలో 294 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలను మరింత పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మొత్తం 100 మార్కులు ఉంటాయి. ఇందులో రాత పరీక్షకు 50 మార్కులు, విద్యార్హతలు, పరిశోధన, గోల్డ్ మెడల్, పీహెచ్‌డీ, ఫెలోషిప్, పేటెంట్లు వంటి అకడమిక్ ప్రతిభకు 50 మార్కులు కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు మాత్రం ఐకార్, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం విద్యార్హతలకు 80 శాతం, డెమో లెక్చర్‌కు 20 శాతం మార్కులు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తుది ఆమోదం ఇచ్చిన వెంటనే ఈ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *