Ap Rain Alert Lightning: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నేడు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు పడవచ్చని పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం 5 గంటల వరకు గుంటూరు జిల్లా తెనాలిలో అత్యధికంగా 29.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 25 మి.మీ., తిరుపతి జిల్లా పుత్తూరులో 21 మి.మీ. వర్షం కురిసింది. వర్షాలు, పిడుగుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు వినిపించినప్పుడు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు..
External Links:
నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!



