Telangana School Bandh

Telangana School Bandh: తెలంగాణలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను భారీగా తగ్గించాలనే ఆలోచనను విరమించుకోవాలని, అలాగే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేయకుండా కఠినమైన చట్టం తీసుకురావాలని కోరుతున్నాయి.

అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈఓ, డీఈఓ, లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థల్లో పుస్తకాల విక్రయాలను నియంత్రించాలని, రాష్ట్రంలో కొత్త విద్యా విధానంపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. బంద్ నేపథ్యంలో చాలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు శుక్రవారం సెలవు ప్రకటించాయి. దీంతో శుక్రవారం, రెండో శనివారం, ఆదివారం కలిపి విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు లభించనున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

నేడు పాఠశాలలు బంద్.. వరుసగా మూడు రోజుల సెలవులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *