Lenin Overseas Review: అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. సినిమా ప్రారంభం బలమైన కథా నేపథ్యం, ఆసక్తికరమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ అందించిన వాయిస్ ఓవర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తుంది. అయితే బలహీనమైన ప్రేమకథ, రొటీన్ కమర్షియల్ సన్నివేశాల వల్ల ఫస్ట్ హాఫ్‌లో కథనం కొంత నెమ్మదిస్తుంది. లవ్ ట్రాక్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ప్రీ-ఇంటర్వెల్ నుంచి సినిమా మళ్లీ ఊపందుకుంటుంది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకుల్లో సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతాయి.
సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతూ ఊహించని మలుపులతో ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రను బలంగా చూపించడంతో పాటు ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ముఖ్యంగా కీలకమైన సన్నివేశంలో అఖిల్ తన నటనతో మెప్పించాడు. ఆ సీన్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినా, ఆయన నటనే హైలైట్‌గా నిలుస్తుంది. మొత్తం మీద ఇంటర్వెల్, క్లైమాక్స్, అఖిల్ నటన సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా, నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్, బలహీనమైన ప్రేమకథ, అక్కడక్కడా తడబడిన స్క్రీన్‌ప్లే కారణంగా లెనిన్ సాధారణ స్థాయి సినిమాగా ఉందని ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ఓవర్శీస్ రివ్యూ..