హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్ కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే, ఎల్ అండ్ టి మరియు సంబంధిత ప్రకటనల ఏజెన్సీలకు ప్రకటనలను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశానని ఆయన అన్నారు. కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది.
ఈ ప్రకటనలను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించాను. ఈ రాత్రికే అలాంటి ప్రకటనలను పూర్తిగా తొలగిస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రోలో ఇటువంటి ప్రకటనలు అనైతికమైనవని, అవి ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపే అవకాశం ఉన్నందున వాటిని అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాడ్స్‌ను ఇకపై నిషేధించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.