మహేంద్ర సింగ్ ధోని అంటే క్రికెట్ అభిమానులకు ఎనలేని ప్రేమ, ఎందరో అభిమానులను తన ఆట ప్రదర్శనతో సొంతం చేసుకున్నాడు. ధోనీ 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పూర్తిగా ఐపీఎల్‌కే అంకితమయ్యాడు. ఐపీఎల్ మ్యాచ్‌లు మినహా మరే ఇతర మ్యాచుల్లోనూ ఆడటం లేదు. ఆ సమయంలో తన విలువైన సమయాన్ని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడుపుతున్నాడు.
అప్పుడప్పుడు సరదాగా తన బైక్స్, కార్లలో రాంచీ వీధుల్లో షికారు చేయడం, ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్లడం వంటివి చేస్తుంటాడు. తాజాగా ధోనీ తన ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రాంచీలోని ఓ లోకల్ ధాబా తన ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్‌ను ఎంజాయ్ చేశారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించి టైం స్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.